: జగన్ కు బెయిల్ ఆ కారణంతోనే..: గాలి
కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ జగన్ కు బెయిల్ వచ్చేలా సహకరించిందని ఆరోపించారు. అనుకున్న స్థాయిలో రాష్ట్రంలో సీట్లు రావన్న భయంతో కాంగ్రెస్ ఇలాంటి పనికి ఒడిగట్టిందని ఆయన దుయ్యబట్టారు. అటు టీఆర్ఎస్ తో, ఇటు వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని చీల్చేందుకు సోనియా కంకణం కట్టుకుందని ఆరోపించారు.