: కళకళలాడుతున్న ఎంజీబీఎస్


సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 70 రోజులుగా బోసిపోయిన హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్(ఎంజీబీఎస్) నేడు ప్రయాణీకుల రద్దీతో కళకళలాడుతోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో శనివారం ఉదయం నుంచి సీమాంధ్ర జిల్లాలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించింది. దానికి తోడు దసరా పండుగ కూడా రావడంతో సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయాణీకులు బస్టాండుకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు, ఫైలిన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణీకులంతా ఎంజీబీఎస్ కు క్యూకట్టారు. దీంతో, ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అదనంగా 1500 బస్సులను నడుపుతోంది.

  • Loading...

More Telugu News