: సమాచారం సేకరిస్తున్నామంటున్న కోదండరాం
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రి వర్గ బృందానికి సమర్పించే నివేదిక కోసం అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డాక్యుమెంటరీ ఫోరం రూపొందించిన జై జై బతుకమ్మ డాక్యుమెంటరీని కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు చివరి దశలో ఉందని చెప్పారు. త్వరలోనే సీమాంధ్ర నాయకుల నుంచి విముక్తి పొందబోతున్నామని అన్నారు.