: తీర్పుల విశ్లేషణ, విమర్శలు కోర్టు ధిక్కరణ కాదు: జస్టిస్ చలమేశ్వర్


న్యాయమూర్తుల తీర్పులపై విశ్లేషణ, విమర్శలు చేయటం కోర్టు ధిక్కరణ కిందకు రాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. అలా జరిగిన రోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వృద్ధాశ్రమం 14వ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే, విమర్శలు సంబంధిత అంశంపై లోతుగా ఉండాలని అన్నారు. పలు కారణాలతో రాజకీయ పక్షాలు న్యాయవ్యవస్థపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని, పరిధి దాటి కోర్టులను ప్రశ్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News