: బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఆర్థిక ఎదుగుదల: జస్టిస్ ఈశ్వరయ్య
వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతారని బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. బీసీ సంఘాల నేతలు ఈ రోజు ఆయనను హైదరాబాదులో ఘనంగా సన్మానించారు. బీసీలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా లెక్కల ద్వారా బీసీల సంఖ్యను నిర్థారించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా రావాలని ఆయన అభిలషించారు.