: సీమాంధ్రులను కాంగ్రెస్ అధిష్ఠానం మోసం చేస్తోంది: గాదె
కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై ఆ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తీర్మానం విషయంలో దిగ్విజయ్ సింగ్, షిండేలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పటికీ వ్యతిరేక అభిప్రాయాలు చెబుతామని గాదె స్పష్టం చేశారు.