: భీమునిపట్నం, కళింగపట్నంలలో పదో నంబరు ప్రమాద హెచ్చరిక
ఫైలిన్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో భీమునిపట్నం, కళింగపట్నంలలో పదో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో ఎనిమిదో నంబరు హెచ్చరికను జారీ చేశారు. కాకినాడలో ఐదో నంబరు... కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.