: దమ్ముంటే వైఎస్సార్సీపీ కూడా ధర్నా చేయాలి: టీడీపీ
ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం ముందు ధర్నా చేసిన టీడీపీ.. వైఎస్సార్సీపీకి సవాల్ విసిరింది. దమ్ముంటే వైఎస్సార్సీపీ కూడా తాము చేసినట్టే సోనియా ఇంటి ముందు ధర్నా చేపట్టాలని చాలెంజ్ చేసింది. తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ, రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ తెలుగు తమ్ముళ్లు ఈ రోజు సోనియా నివాసం ముందు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ కూడా తమలాగే సోనియా నివాసం ముందు ధర్నా చేస్తే తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్ అన్నారు.