: తుపాను సమయంలో జాగ్రత్తలివి


పైలిన్ తుపాను తీరప్రాంతాలపై విరుచుకుపడేందుకు దూసుకువస్తోంది. ఇది సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు విరుచుకుపడే ప్రమాదముంది. దీంతో నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. అవేంటో వారి మాటల్లోనే.. 'టవర్లు, భారీ హోర్డింగులు, గోడలు కూలిపోయే ప్రమాదముంది. వైర్లు తెగిపడే ప్రమాదముంది. కిటికీల అద్దాలు పగిలిపోయే ప్రమాదముంది. మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

అందువల్ల భారీ హోర్డింగులు, కరెంటు స్థంభాలు, టెలిఫోన్ స్థంభాలకు సమీపంలో నిలబడటం కానీ వాహనాలు పార్కింగ్ చేయటం కానీ వద్దు. కరెంటు వైర్లు తెగిపడే ప్రమాదమున్నందున వాటికి దగ్గర్లో ఉండడం మంచిది కాదు. వర్షం నుంచి కాపాడటానికి గొడుగుల కంటే టోపీలు, రైన్ కోట్లు సురక్షితం. నీళ్లు నిలిచి మ్యాన్ హోళ్లు ప్రమాదంగా పరిణమించే అవకాశముండడంతో వాటిపై కర్రజెండాలు కానీ, బోర్డులు కానీ ఏర్పాటు చేయాలి.

తాగునీరు ముందుగానే నిల్వ చేసుకోవాలి. విద్యుత్ సరఫరా జరిగే అవకాశం లేనందున సరిపడా కొవ్వొత్తులు ఇతరాలు సరిచూసుకోవాలి. నిత్యావసరాలు సరిపడా ఇంటిలో ఉంచుకోవాలి. పిల్లలు, వృద్దుల కోసం మందులు సిద్ధంగా పెట్టుకోవాలి. కిటికీల దగ్గర ఉండకపోవడం మేలు. సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటే మంచిది. అలాగే కంట్రోల్ రూం నెంబర్లు కూడా దగ్గర పెట్టుకోవాలి'.

  • Loading...

More Telugu News