: యూపీలో పసిమొగ్గపై అత్యాచారం
మరో చిన్నారి.. కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఇది కూడా అత్యాచారాల రాజధానిగా పేరుపడ్డ ఉత్తరప్రదేశ్ లోనే.. ముజఫర్ నగర్ సమీపంలో జరిగింది. ఫహీమ్ పూర్ గ్రామంలో ఐదేళ్ల బాలికను యువకుడు అపహరించి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఆ చిన్నారి శనివారం నుంచి కనిపించకుండా పోయిందని.. తర్వాత గ్రామం వెలుపల పొలాల్లో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుడిని ఈ రోజు అరెస్ట్ చేసినట్లు చెప్పారు.