: మలాలాకు నోబెల్ దక్కకపోవడంతో తాలిబన్ల సంబరాలు


తాలిబన్ల చేతిలో చావు అంచుల దాకా వెళ్లి పునర్జన్మ ఎత్తిన సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ కి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఆ అవార్డు 'ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్' అనే సంస్థకు దక్కింది. అవార్డు ప్రకటించేంత వరకు కరడుగట్టిన తాలిబన్లు చాలా ఉత్కంఠభరిత పరిస్థితిని అనుభవించారు. నోబెల్ అవార్డు మలాలాకు మిస్ అవడంతో... ఊపిరి పీల్చుకున్న తాలిబన్లు సంబరాల్లో మునిగితేలారు. మలాలా ఏ విధంగా నోబెల్ అవార్డుకు అర్హురాలని తెహ్రీక్-ఏ-తాలిబన్ నేత షహీదుల్లా ప్రశ్నించారు. ఆ అమ్మాయి ఏం చేసిందని అవార్డు ఇస్తారని అన్నారు. ఈ అవార్డును స్వచ్ఛమైన ముస్లింలకు మాత్రమే ఇవ్వాలని... మలాలా ముస్లింకాదని, ఆమె ఒక సెక్యులర్ బాలిక అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News