: సంతృప్తిగా ఉన్నామంటున్న అశోక్ బాబు


ఉద్యోగుల సమ్మె పట్ల సంతృప్తిగా ఉన్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని సమర్థంగా వివరించగలిగామని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో ప్రజల కష్టాలు చూస్తున్నప్పటికీ, రాజకీయ నేతల్లో మాత్రం కదలిక రావడంలేదని మండిపడ్డారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాజీనామాలు చేసిన నేతలు ఇప్పుడెందుకు చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేలా రాజకీయ నేతలు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని, అందుకే ఆ బాధ్యతలు తాము స్వీకరించామని అశోక్ బాబు స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలు ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News