: తుపాన్లను ఇలా గుర్తిస్తారు..


తుపాను.. ఈ పేరు వింటే చాలు సముద్ర తీర ప్రాంత వాసులు భీతిల్లిపోతారు. అది సృష్టించే బీభత్సం అలాంటిది. అయితే, వాతావరణ శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరికలు చేయకుంటే జరిగే నష్టాన్ని మనం అంచనా వేయలేం. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ విలయం నుంచి కాపాడుకోగలం. వాతావరణ శాస్త్రవేత్తలు అసలీ తుపాన్లను ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం. వాతావరణ నిపుణులు అవసరాన్ని బట్టి కొన్ని ప్రత్యేక రసాయనాలు పూసిన బెలూన్లను గాల్లోకి వదులుతారు. గాలి తీవ్రతను బట్టి ఆ రసాయనాల్లో మార్పులు కలుగుతాయి. ఈ మార్పులను బెలూన్లోని పరికరాలు వాతావరణ కేంద్రంలోని కంప్యూటర్ కు చేరవేస్తాయి.

ఇక వాతావరణ కేంద్రంలోని డాప్లర్ రాడార్ సిస్టమ్ ద్వారా వాతావరణంలో తేమను అంచనా వేస్తారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కొద్దిపాటి వర్షం పడినా గానీ ఈ డాప్లర్ వ్యవస్థ పసిగడుతుంది. వీటన్నింటిని మించి, వాతావరణ పరిశీలనకు ఉద్దేశించిన ఉపగ్రహాలు సముద్రంలో ఏర్పడే మార్పులను ఎప్పటికప్పుడు సమాచారం, ఛాయాచిత్రాల రూపంలో వాతావరణ కేంద్రాలకు చేరవేస్తుంటాయి. ఈ సమాచారాన్నంతటినీ క్రోడీకరించి తుపాను తీవ్రతను, గమన వేగాన్ని, దిశను గుర్తిస్తారు. తద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు.

  • Loading...

More Telugu News