: ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉన్నాం:రఘువీరా


సమ్మె చేస్తున్న ఉద్యోగులంతా విధుల్లోకి వచ్చారని, సహాయక చర్యలు మరింత ముమ్మరం చేస్తామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. భీమిలిలో ఆయన మాట్లాడుతూ.. త్రాగు నీరు, విద్యుత్ సమస్యలు వస్తే తక్షణం పరిష్కరిస్తామని అన్నారు. తుపానుపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. భీమిలిలో 80 అడుగుల రక్షణ గోడ కూలడంతో సంఘటనా స్థలాన్ని సందర్శించిన రఘువీరా, అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తామంతా అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్థంగా ఉన్నామని రఘువీరా భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News