: బారువా కొత్తూరులోకి చొచ్చుకొచ్చిన అలలు..పరుగులు తీసిన ప్రజలు


శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా కొత్తూరు గ్రామంలోకి సముద్రపు అలలు చొచ్చుకొచ్చాయి. దీంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట వద్ద 150 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. దీంతో, గ్రామంలోని 400 మందిని పెద్దమురారిపురం పునరావాస కేంద్రానికి తరలించారు. విశాఖ జిల్లా భీమిలి తీరంలో అలల ధాటికి 80 అడుగుల రక్షణ గోడ కూలిపోయింది. దీంతో, పోలీసులు ఇసుకబస్తాలు వేసి అలలను అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి స్థానికులు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు.

  • Loading...

More Telugu News