: సింగపూర్ కు అన్నపూర్ణేశ్వరి మనదేశమే
ద్వీపదేశమైన సింగపూర్ కు అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. 1998 నుంచి ఇప్పటి వరకూ మొదటి స్థానంలో ఉన్న థాయ్ లాండ్ ను దాటుకుని భారతే సింగపూర్ పాలిట అన్నపూర్ణేశ్వరిగా అవతరించింది. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో సింగపూర్ కు 92,865 టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. అంటే ఆ దేశం దిగుమతి చేసుకున్న మొత్తం బియ్యంలో భారత వాటా మూడింట ఒక వంతు. థాయ్ లాండ్ 85,816 టన్నులు (30.4శాతం), వియత్నాం 77,459 టన్నులు(27.4శాతం) సింగపూర్ కు ఎగుమతి చేశాయి.