: తూర్పు గోదావరి థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేకుల ఆందోళన


తూర్పు గోదావరి జిల్లా సింగంపల్లి వద్ద కేపీఆర్ ఫెర్టిలైజర్స్ కు చెందిన బస్సును ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికులు అడ్డుకున్నారు. జిల్లాలో నిర్మించాలను కుంటున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని కొన్నిరోజుల కిందట కేపీఆర్ ఫెర్టిలైజర్స్ పేర్కొంది.

ఇందుకు ఆగ్రహించిన స్థానికులు కేపీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో అక్కడినుంచి బలవంతంగా పంపివేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ఆందోళనకారుల్లో కొంతమందికి కొద్దిపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిని బెదరగొట్టేందుకు డీఎస్పీ గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు.

  • Loading...

More Telugu News