: ఫైలిన్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు
ఫైలిన్ తుపాను కారణంగా తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్-విశాఖ(భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్), సికింద్రాబాద్-భువనేశ్వర్(విశాఖ ఎక్స్ ప్రెస్), భువనేశ్వర్-సికింద్రాబాద్(విశాఖ ఎక్స్ ప్రెస్) రైళ్ళను రద్దు చేసినట్టు రైల్వేశాఖాధికారులు వెల్లడించారు. వాస్కోడిగామా-హౌరా ఎక్స్ ప్రెస్ ను విశాఖపట్నం వరకు, తిరుపతి-పూరీ ఎక్స్ ప్రెస్ ను పలాస వరకు కుదించినట్లు అధికారులు తెలిపారు.