: నెక్లెస్ రోడ్డులో ఇంజనీరింగ్ విద్యార్థుల 3 కే రన్


టెక్నోలైట్ ఫెస్టివల్ ప్రమోషన్ లో భాగంగా శంషాబాద్ వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో 3కే రన్ నిర్వహించారు. గో గ్రీన్ అనే నినాదంతో చేపట్టిన 3 కె రన్ కార్యక్రమాన్ని వర్థమాన నటుడు కౌశిక్ ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజానుంచి ప్రారంభమైన ఈ 3కే రన్ లో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 18,19 తేదీల్లో జరుగనున్న టెక్నోలైట్ ఫెస్టివల్ ప్రమోషన్ నిమిత్తం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 3కే రన్ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News