: హోటల్ భవనం కూలి కార్మికుడి మృతి
నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో శిథిలమైన హాటల్ భవనం కూలి ఓ కార్మికుడు మృతి చెందాడు. మృతుడు సంస్థాన్ నారాయణపురం మండలం కడపగంటి తండాకు చెందిన కరంపోతు శంకర్(22) గా గుర్తించారు. శంకర్ గత కొన్నేళ్లుగా హోటల్ లో పని చేస్తున్నాడు. శిథిలాల క్రింద ఉన్న శంకర్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.