: ఈ అర్థరాత్రికి తీరం దాటనున్న 'ఫైలిన్'
ఉత్తరకోస్తాతో పాటు ఒడిశాను వణికిస్తున్న ఫైలిన్ తుపాను ఈ రోజు అర్థరాత్రి గోపాల్ పూర్ సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ సందర్భంగా అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశముందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ రాథోడ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తీరం దాటిన అనంతరం క్రమేణా బలహీనపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ తుపాను గోపాల్ పూర్ కు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఒడిశాతో పాటు కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. కాగా, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 8వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.