: 2 లక్షల 60 వేల మంది తరలింపు.. నిత్యం అప్రమత్తం: ఒడిశా
ఫైలిన్ తుపాను ఒడిశా తీరాన్ని తాకనుండడంతో పెను విధ్వంసం తప్పదని ముందుగా నిర్థారణకు వచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు సముద్రానికి దగ్గర్లో ఉన్న, లోతట్టు ప్రాంతాలకు చెందిన 2 లక్షల 60 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరో వైపు ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెయ్యిమంది విపత్తు నివారణ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకోవైపు రక్షణ శాఖ ప్రమాదం ఎదురయ్యే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి, ప్రమాదం వాటిల్లకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పలు జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అత్యవసర సేవలకు అత్యాధునిక హెలీకాప్టర్లు, విమానాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సర్వసన్నద్దంగా ఉన్నారు.