: 100 అడుగులు ముందుకు దూసుకొచ్చిన సముద్రం
ఫైలిన్ ధాటికి సముద్రం 100 అడుగులు ముందుకు దూసుకొచ్చింది. మరో వైపు సముద్రం ఎగిసెగిసి పడుతోంది. తుపాను ధాటికి తీరంలో అలలు మూడున్నర మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. విపత్తు నివారణ నిర్వహణాధికారులు సర్వ సన్నద్ధంగా ఉన్నారు. విద్యుత్, టెలీఫోన్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉండడంతో ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్ సహాయ సహకారాలు తీసుకుంది. ఇప్పటికే నష్టానికి గురయ్యే 11 మండలాలను, 237 గ్రామాలను గుర్తించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర కోస్తాలో వర్షం విస్తారంగా కురుస్తోంది.