: సైబరాబాద్ పరిధిలో రెండు నెలలపాటు 144 సెక్షన్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు నెలలపాటు 144 సెక్షన్ అమలు విధిస్తూ కమీషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి డిసెంబర్ 11 వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. ఈ నెల 18 వరకు నగరంలో పలు నిషేధాజ్ఞలు అమలవుతాయన్నాయి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న రోజుల్లో ఆయా ప్రాంతాల డీసీపీల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. తల్వార్లు, కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, రాళ్లు వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉండే వస్తువులు పట్టుకుని తిరగరాదు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడరాదు. వాహనాలపై తిరుగుతూ మైకుల ద్వారా ప్రసంగాలు చేయరాదు.