: రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
భారత వాతావరణ శాఖ ఫైలిన్ తుపాను నేపధ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. ఫైలిన్ తుపాను కళింగపట్నానికి 315 కి.మీ, గోపాల్ పూర్ కు 315 కి.మీ, పారాదీవ్ కు 355 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సముద్రంలో అలలు 54 అడుగుల ఎత్తుకు పైగా ఎగిసిపడి తీరంపై విరుచుకుపడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.