: పొగతో పదేళ్ల జీవితకాలాన్ని ఊదేసుకుంటారట!


పొగతాగడం మానండి బాబూ... అని చిలక్కు చెప్పినట్టు చెప్పినా... వినకుండా రైలింజను లాగా గుప్పు గుప్పుమంటూ పొగవదిలే వారికి ఇది ఒక హెచ్చరిక. మీరు మీ జీవిత కాలాన్ని చేజేతులారా పదేళ్ళు తగ్గించేసుకుంటున్నారు. అంటే మీరు బతికే కాలాన్ని మీరే స్వయంగా పదేళ్లపాటు కుదించేసుకుని ముందే చనిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్నమాట. ఈ విషయాన్ని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు.

పొగతాగే అలవాటు ఉన్నవారు ఉన్నట్టుండి హటాత్తుగా మరణిస్తారని ఆస్ట్రేలియాలో పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందుకోసం పరిశోధకులు పొగతాగే అలవాటున్న వారి వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితులను నాలుగేళ్లపాటు నిరంతరాయంగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాత ధూమపానం అనే అలవాటు ఒక వ్యక్తి జీవిత కాలాన్ని పదేళ్ల పాటు తగ్గించేస్తుందని, ఫలితంగా పదేళ్ల ఆయుర్ధాయాన్ని కోల్పోయిన వ్యక్తి తొందరగానే మృత్యువును చేరడం ఖాయమని తేల్చారు. దాదాపు ఇరవై వేలమందికి చెందిన రికార్డులను వీరు ఈ సందర్భంగా పరిశీలించారు. పొగతాగే అలవాటుకు ఏ వయసులో బానిసలైనవారైనా సరే ఈ అలవాటును వెంటనే మానేస్తే కచ్చితంగా ఎలాంటి సమస్యలు ఉండవని, ప్రాణభయం అనేది అసలే ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News