: ఎలాంటి గాయాన్నైన మెదడు మాన్పుతుంది!


శరీరానికి తగిలిన గాయాన్నేకాదు... సమాజం చేసిన గాయాన్ని కూడా మాన్పడానికి మెదడు ప్రయత్నిస్తుందట. ఇలా సామాజికంగా మనసుకు తగిలిన గాయానికి మెదడు స్పందించే తీరును బట్టే సదరు వ్యక్తులు పరిస్థితులకు సర్దుకుపోవడం లేదా వ్యతిరేక భావాలతో కుమిలిపోవడం వంటివి జరుగుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సమాజంలో అవమానానికి గురైనప్పుడు మనసుకు కలిగే బాధను మెదడు సాంత్వన పరుస్తుందని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో గుర్తించారు.

మనకు నొప్పి అనే భావన కలిగినప్పుడు మన మెదడు నాడుల మధ్యలోకి ఓపిఆయిడ్స్‌ అనే రసాయనాలు విడుదల అవుతాయని, ఈ రసాయనాలు నొప్పి సంకేతాలను తగ్గిస్తున్నట్టు పరిశోధకులు తమ పరిశోధనల్లో రుజువు చేశారు. మిచిగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మన శరీరానికి గాయం తగిలినప్పుడేగాక సామాజిక తిరస్కరణకు గురైనప్పుడు కూడా మెదడులోని సహజనొప్పి నివారణ వ్యవస్థ స్పందిస్తున్నట్టు కనుగొన్నారు. అనుకోకుండా జరిగే సంఘటనలకు తట్టుకుని నిలబడే వారిలో ఈ సహజ నొప్పి నివారణ వ్యవస్థ ప్రేరేపితం కావడం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటున్నట్టు వీరి అధ్యయనంలో బయటపడింది. సామాజిక తిరస్కరణకు గురైనప్పుడు మెదడులోని ఓపిఆయిడ్‌ వ్యవస్థ ప్రేరేపితమవుతున్నట్టు గుర్తించడం ఇదే మొదటిసారి అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డేవిడ్‌ టి. సు చెబుతున్నారు. ఈ ఓపిఆయిడ్‌ రక్షణ కల్పించేదిగాను, లేదా సర్దుకుపోయేలా మారటానికి తోడ్పడుతుందని డేవిడ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News