: యువతరంపై మోడీ 'ముద్ర'


దేశంలో రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడికీ లేని క్రేజు మోడీకి ఉంది. బీజేపీకి చెందిన మోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత ఆయనపై యువతకు మరింత ఆసక్తి పెరిగింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆయనపై తమ అభిమానాన్ని చాటుకోవడమేకాదు, ఇప్పుడే ఆయన్ను తమ దేహంపై ముద్ర వేయించుకోవడానికి కూడా యువత ఉత్సాహం చూపుతున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌ యువత ఒక సరికొత్త ధోరణికి శ్రీకారం చుట్టింది. తమ భుజాలపైన వీపుపైన మోడీ రూపాన్ని టాటూలుగా (పచ్చబొట్లు) ముద్ర వేయించుకుంటున్నారు. గతంలో మహాత్ముడి జన్మదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌ ప్రభుత్వం మోడీ కుర్తాకు విస్తృత ప్రచారం కల్పించింది. ఇప్పుడు టాటూల ద్వారా మోడీ జనాల గుండెల్లో కొలువైపోతున్నాడు. ఈ విషయం గురించి టాటూస్‌ చిత్రకారుడు నికిల్‌ భానుశాలి మాట్లాడుతూ మోడీ చిత్రాన్ని మొదట్లో బీజేపీ కార్యకర్తలే టాటూగా వేయించుకునేవారని, అయితే ఇప్పుడు ఈ సంస్కృతి క్రమేపీ విస్తరించిందని, గుజరాత్‌నుండి ముంబైకి కూడా పాకి చాలామంది యువతీ యువకులు మోడీ చిత్రాన్ని టాటూలుగా వేయించుకోవడానికి ఉత్సుకత చూపుతున్నారని, మోడీ వాక్చాతుర్యానికి యువత ముగ్ధులవుతున్నారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News