: శనగలతో లోపాన్ని సరిచేయవచ్చు


చిన్న పిల్లల్లో, పెద్దవారిలోను ఎక్కువగా కనిపించేలోపం రక్తహీనత. దీన్ని నివారించడానికి మన ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరి. రక్తహీనతను నివారించడానికి, అలాగే పిల్లలకు చిరుతిళ్లుగాను బాగా ఉపకరించేవి శనగలు. వీటిలో పోషకాలశాతం కూడా ఎక్కుగానే ఉంటాయి. బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు రోజూ ఉదయాన్నే గుప్పెడు శనగలను తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శనగల్లో జింక్‌, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. పిల్లల్లో జింక్‌ లోపం కారణంగా ఎదుగుదలలో సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించడానికి శనగలు ఉపయోగపడతాయి. ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. కొలెస్టరాల్‌ సమస్యతో బాధపడుతున్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట అల్పాహారంగా సెనగలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు ఉడికించిన శనగలను తినడం వల్ల వాటినుండి అత్యధిక పీచు శరీరానికి లభిస్తుంది. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ ఒక కప్పు ఉడికించిన శనగలు తింటే ఒక రోజుకు అవసరమైన ఇనుములో ముఫ్ఫైశాతం అందుతుందని అంచనా. అలాగే ఎముకలను గుల్లబారకుండా చేసే కాల్షియం, గర్భధారణ సమయంలో అవసరమయ్యే ఫొలేట్‌లు వీటిద్వారా పుష్కలంగా అందుతాయి. మన రోజువారీ పనులకు అవసరమయ్యే ఫొలేట్‌లు డెబ్భై శాతం వరకూ రోజూ ఒక కప్పు శనగలను తింటే లభిస్తాయి. అంతేకాదు రొమ్ము క్యాన్సర్‌ని అడ్డుకునే పోషకాలు కూడా శనగల్లో ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మన రోజువారీ ఆహారంలో శనగలను చేర్చుకుని ఆరోగ్యంగా ఉందాం.

  • Loading...

More Telugu News