: నాలుగు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఫైలిన్ తుపాను పరిస్థితి తెలుసుకునేందుకు నాలుగు జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు రాత్రి ఫోన్ లో మాట్లాడారు. తుపానుకు సంబంధించి అన్ని విధాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.