: పుంజుకున్న రూపాయి
రూపాయి పుంజుకుంటోంది. నేడు గరిష్ఠంగా 32 పైసలు లాభపడ్డ రూపాయి రెండునెలల గరిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. ఈ రోజు ఉదయం వరకు డాలర్ మారకంతో 61.39 గా ఉన్న రూపాయి స్టాక్ మార్కెట్లలో ఇన్ఫోసిస్ తెచ్చిన ఊపుతో సాయంత్రానికి 32 పైసల మేర బలపడింది. దీంతో రెండునెలల గరిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది.