: సచిన్ చివరి మ్యాచ్ కు సొంత గడ్డ వేదికయ్యేనా..?


సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కు హోం గ్రౌండ్ లోనే వీడ్కోలు పలికే అవకాశం ఉంది. తన చివరి మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానాన్ని వేదికగా ఖరారు చేయాలని సచిన్ బీసీసీఐని కోరినట్టు ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు. అయితే, మంగళవారం సమావేశమయ్యే బీసీసీఐ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ సచిన్ కి 200వ టెస్టు మ్యాచ్.

  • Loading...

More Telugu News