: భద్రత కోసం రైళ్లలో సాయుధ పోలీసులు
ప్రయాణికుల భద్రత కోసం రైళ్లలో సాయుధ పోలీసులను ఏర్పాటు చేస్తున్నామని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి కాలంలో రద్దీ దృష్ట్యా దోపిడీలు, దొంగతనాలకు అవకాశం లేకుండా భద్రత కోసం గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) బలగాలతో బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.