: శ్రీకృష్ణ కమిటీ నివేదికను మంత్రుల బృందం పరిశీలిస్తుంది: షిండే
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రుల బృందం పరిశీలించనుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర పరిస్థితులు, విభజన నిర్ణయం గురించి 2010లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమర్పించిన నివేదికను కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పార్టీని నిలబెట్టుకునేందుకు ఉపయోగించుకోనుంది. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ.. విభజన ప్రకటిస్తే సీమాంధ్రలో భారీ ఉద్యమం వస్తుందని హెచ్చరించింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాదుతో కూడిన తెలంగాణకు మద్దతిచ్చింది. దీంతో, కేంద్రం ప్యాకేజీతో సీమాంధ్రులను బుజ్జగించవచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే ప్యాకేజీ అంటూ లీకు రాజకీయాలను నడుపుతోందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.