: శ్రీశైలంలో బయల్పడ్డ పురాతన మంటపం


శ్రీశైలం భ్రమరాంబిక ఆలయంలో తవ్వకాలు జరుపుతుండగా పురాతన మంటపం బయటపడింది. భ్రమరాంబిక ఆలయానికి ముందు ఉన్న శ్రీశైల జగద్గురు పీఠం కింద ఈ మంటపం ఉన్నట్టు గుర్తించారు. దేవస్థాన ఈవో చంద్రశేఖర్ ఆజాద్, సీఐ కె.నాగేశ్వరరావులు ఈ ప్రాచీన కట్టడాన్ని పరిశీలించారు. కాగా, దానికి ఆనుకుని ఓ సొరంగం కూడా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News