: బాపట్లలో భారీ వర్షం
గుంటూరు జిల్లా బాపట్లలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఫైలిన్ తుపాన్ ప్రభావంతో గుంటూరు కలెక్టరేట్, తెనాలి ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సముద్రతీరంలోని 12 లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తుపాను తీరం దాటేవరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.