: తరుముకొస్తున్న 'ఫైలిన్'.. జీహెచ్ఎంసీ అప్రమత్తం


ఫైలిన్ తుపాను ప్రభావంతో తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో జంట నగరాల్లో 165 లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. 13,14 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం అందించిందని, ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన గృహ సముదాయాలు, అసంపూర్తిగా మిగిలిన సెల్లార్ నిర్మాణాలపై నిఘాపెట్టామన్నారు. తుపాను వల్ల తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక, పోలీసు, విపత్తు నివారణ సిబ్బందికి అధునాతన పరికరాలు అందించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News