: భారత్ కు క్షమాపణ చెప్పిన విశ్వ సుందరి


తాజ్ మహల్ వద్ద బ్రాండెడ్ చెప్పుల కంపెనీకి ఫోటో షూట్ చేసిన విశ్వ సుందరి ఒలీవియా కల్పో... భారత్ కు క్షమాపణ చెప్పింది. ఒలీవియా వాణిజ్య ప్రకటనల కోసం ఫోటోలు దిగలేదని.. కేవలం అభిమానుల కోసం రూపొందిస్తున్న ఆల్బమ్ కోసమే ఆ పని చేసిందని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ వివరణ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ, ఈ సంఘటన భారతీయుల మనోభావాలను గాయపరిచిందని... దీనికి క్షమాపణలు చెపుతున్నామని ప్రకటించింది. తాజ్ మహల్ లో వాణిజ్యపరమైన కార్యక్రమాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. అందుకే, బ్రాండెడ్ కంపెనీ చెప్పులతో ఫొటోలకు పోజిచ్చిన విశ్వ సుందరిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News