: అమెరికా బడ్జెట్ సంక్షోభం ముగిసేనా..?


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ నేతలు ఆ దేశంలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులు చక్కదిద్దేందుకు నడుంబిగించారు. అమెరికా ప్రభుత్వంతో రిపబ్లిక్ పార్టీ నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే, అవి ఫలవంతం కానప్పటికీ రెండు వర్గాలు సంక్షోభాన్ని ముగించేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని నిశ్చయించుకున్నాయి. ఈ క్రమంలో నేటి రాత్రి మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించాయి. అమెరికాలో అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, అమెరికా ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అక్టోబర్ 17 లోగా ఆమోదించాలని లేని పక్షంలో సంక్షోభం ఖాయమని అంటుండగా.. రిపబ్లికన్స్ మాత్రం తాము సూచించిన మార్పులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.

మార్పులు లేకుంటే దేశం మరోసారి ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తుందని, అందుకే ముందు జాగ్రత్తగా బడ్జెట్ లో మార్పులు చేయాలని తాము కోరుతున్నామని చెబుతున్నారు. ఏదేమైనా, అమెరికన్లు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ రాత్రి జరగనున్న చర్చలు ఆశావహంగా ముగుస్తాయని రెండు వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News