: బాబ్లీతో తిప్పలే.. సీఎంకు అవగాహనలేమి: టీడీపీ నేతలు
బాబ్లీ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చెప్పడం ఆయన అవగాహనలేమికి నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. గోదావరిపై మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల మన రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. టీడీపీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దిరెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 2.67 టీఎంసీల తాగునీటి కోసమని చెబుతూ వందల టీఎంసీల నీటిని దోచుకునే ప్రయత్నం మహారాష్ట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని డిమాండ్ చేశారు.