: అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై విచారణకు డిమాండ్
కేరళలోని సూర్యనెళ్లికి చెందిన పదహారు సంవత్సరాల బాలిక అత్యాచారం కేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ పై విచారణ చేయాలంటూ పలువురి నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ దారుణ ఘటనలో కురియన్ కు సంబందం ఉందనీ, విచారణలో ఆయన పేరు చేర్చి నిర్ధారణ చేయాలని కేరళ అసెంబ్లీ సమావేశాల్లో ఎల్డీఎఫ్ కూటమికి చెందిన ప్రధాన ప్రతిపక్షం సీపీఐ (ఎమ్) డిమాండ్ చేస్తోంది.
అయితే, వీరి నోటీసుపై జీరో అవర్ లో చర్చించేందుకు సభ తిరస్కరించింది. దాంతో మహిళా ఎమ్మేల్యేలు ప్లకార్డులు పట్టుకొని సభ బయట నిరసన చేపట్టారు. వెంటనే సభాపతి జీ. కార్తికేయన్ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి టి.రాధాక్రిష్ణన్, కురియన్ పై పునర్విచారణ చేపట్టాలన్నడిమాండుకు అంగీకరించలేమన్నారు.