: దిగ్విజయ్, షిండే పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు: కొణతాల


దిగ్విజయ్ సింగ్ ఓ ప్రకటన చేస్తే, హోం శాఖా మంత్రి షిండే మరో రకమైన ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇతర నేతలకు అడ్డుపడుతూ వారిని మభ్యపెడుతున్నారని అన్నారు. తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండో ఎస్సార్సీ అన్న కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుని తమను నిందించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఫైలిన్ తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News