: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే తనయుడి దుర్మరణం
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాధేశ్యామ్ జైస్వాల్ (సమాజ్ వాదీ పార్టీ) కుమారుడు శైలేంద్ర జైస్వాల్ (30) నేడు ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సీతాపూర్ నుంచి లక్నో వెళుతుండగా జలాల్ పూర్ వద్ద అతను ప్రయాణిస్తున్న టవేరా వాహనం మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఓ ట్రక్కును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో శైలేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఘటనలో టవేరా డ్రైవర్, శైలేంద్ర బాడీగార్డుకు గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.