: ఏపీ భవన్ వద్ద టీడీపీ ఎంపీల అరెస్ట్


ఏపీ భవన్ వద్ద టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని పార్లమెంటు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష భగ్నం చేయడంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు సోనియాగాంధీ నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో, వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సీఎం రమేశ్, నారాయణరావు, మాగంటి బాబు, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News