: హైదరాబాద్ విషయంలో కేబినెట్ నోట్ లో మార్పులేదు: పీటీఐ
హైదరాబాద్ విషయంలో కేబినెట్ నోట్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. హైదరాబాదును యూటీ చేస్తే తెలంగాణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించింది. కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన కేంద్రం మదిలోనే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అధునాతన సదుపాయాలతో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో ఉన్నట్లు పీటీఐ వెల్లడించింది. ఆంధ్ర, రాయలసీమలకు గరిష్ఠ ఆర్ధికసాయం చేసే తలంపుతో మంత్రుల బృందం ఉందని, ఇక విభజన ప్రక్రియపై ఏర్పాటు చేసిన ఈ మంత్రుల బృందం రాష్ట్రానికి రాకపోవచ్చని కూడా తెలిపింది. ఏదిఏమైనా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరితంగా పూర్తిచేసే యోచనలో ఉన్నట్లు సవివరంగా తెలిపింది.