: సోనియా నివాసాన్ని ముట్టడిస్తాం: పయ్యావుల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సోనియా నివాసాన్ని ముట్టడిస్తామని అన్నారు. సమన్యాయం గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే '10 జన్ పథ్' ముట్టడికి తమ కార్యకర్తలు బయల్దేరారని ఆయన తెలిపారు.