: విభజనవల్ల అన్ని ప్రాంతాలకు శాశ్వత నష్టం: సీఎం
రాష్ట్ర విభజన జరిగితే అన్ని ప్రాంతాలకూ శాశ్వతంగా నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అందుకే తాను విభజనను వ్యతిరేకిస్తున్నానని, రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో చెబుతున్నానని అన్నారు. తాను రాజకీయాలకోసం ఇలా మాట్లాడటంలేదని చెప్పుకొచ్చారు. సాగునీరు అందక సీమాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని, రైతులకు జరిగే నష్టాన్ని పూడ్చలేమన్నారు. ఈ రోజు సీమాంధ్ర రైతు జేఏసీ నేతలతో జరిపిన చర్చల సమయంలో సీఎం ఆందోళన వ్యకం చేశారు. దేశంలో ఎక్కడాలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని వివరించారు.