: తుపాను సహాయక చర్యలకు సైన్యం: ఆంటోనీ
ఫైలిన్ తుపాను ప్రచండ తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు నడుంబిగించింది. ఈ తుపాను ప్రధానంగా ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలపై పెను ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాఖ నివేదికలతో అప్రమత్తమైన కేంద్రం.. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలకు సైన్యాన్ని వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని సైనిక దళాలకు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల కోసం భారత వాయుసేనకు చెందిన రెండు ఐఎల్-76 విమానాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. రెండు సీ130జే రవాణా విమానాలు, 18 హెలికాప్టర్లు, రెండు ఏఎన్-32 విమానాలను సిద్ధంగా ఉంచారు.