: అర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది: అశోక్ బాబు


విభజన తీర్మానంపై దిగ్విజయ్ సింగ్, షిండే ప్రకటనలతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. తాము కూడా సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. 13,14,15 తేదీల్లో తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే నేతలను కలిసి సమైక్య ఉద్యమానికి మద్దతు కోరతామని వెల్లడించారు. 17,18,19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో వ్యతిరేకించాలని డిమాండ్ చేసిన అశోక్ బాబు.. తెలంగాణపై వేసిన జీవోఎం లోపభూయిష్టంగా ఉందన్నారు. తెలంగాణ కోసం 371(డి) ఆర్టికల్ ను తెచ్చే హక్కు కేంద్రానికి లేదని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ నెలాఖరులో ఢిల్లీ పర్యటన ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News