: పలు రైళ్లు రద్దు.. ఫైలిన్ ఎఫెక్ట్
ఫైలిన్ తుపాను కారణంగా ఈ రోజు పలు రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. విశాఖ-పలాస, విశాఖ-విజయనగరం ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడించింది.
అలాగే, రేపు... పలాస-విశాఖ, గున్పూర్-పూరీ-గున్పూర్, పలాస-గున్పూర్, విజయనగరం-పలాస, విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.